నిజాంపేట్ 26వ వార్డ్ ప్రశాంత్ హిల్స్ అపార్ట్మెంట్ డ్రైనేజ్ సమస్యను అల్లాడి మహేష్ సూచనతో కొలను శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వారు అధికారులతో చర్చించి కొత్త డ్రైనేజ్ పైపులను ఆదివారం ఏర్పాటు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో ముఖ్యఅతిథులుగా శ్రీనివాస్ రెడ్డి, అల్లాడి మహేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి పనులకు శుభారంభం చేశారు.