కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వివేకానంద నగర్ కాలనీలోని ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హారిక(14), లక్ష్మీదుర్గ(13) అనే విద్యార్థినిలు రోజు మాదిరి బుధవారం పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపించలేదు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను క్షేమంగా తీసుకురావాలని పోలీసులను తల్లిదండ్రులు వేడుకున్నారు.