బాచుపల్లిలో భర్తను భార్యే హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 22న భర్త మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లిన భార్యపై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భర్తను భార్యే హత్య చేసినట్టు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.