కూకట్పల్లి: అధికారులకు ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సర్వే అధికారులకు సోమవారం ఝలక్ ఇచ్చారు. కులగణన సర్వే చేయటానికి అధికారులు ఆయన కార్యాలయానికి చేరుకోగా గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించారు. ఆరోజు సర్వే వద్దని ఇప్పుడు ఏం మోహంతో రేవంత్ రెడ్డి సర్వే చేపడుతున్నారని ప్రశ్నించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు.