రేపటి నుంచి మళ్ళీ కూల్చివేతలు... ఇళ్ల ముందు బోర్డులు
మూసి నది పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలను మంగళవారం నుంచి పునఃప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మూసి రివర్ బెడ్ పై 2, 116 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కాగా కూల్చివేతలు పునఃప్రారంభం నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతాల్లోని 100 మందికి పైగా ఇళ్ల యజమానులు తమ ఇళ్ళకు ప్లెక్సీలు వేలడదిశారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని అందులో పేర్కొన్నారు.