కూకట్ పల్లి: సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో కూకట్ పల్లి డివిజన్‌కు చెందిన ఆర్. క్రాంతి కిరణ్ కు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. రూ. 3, 50, 000 విలువగల చెక్కును అందజేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఎంఆర్ఎఫ్ తో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు.