తెలంగాణ వీడనున్న ఆమ్రపాలి... ఆ ఐఏఎస్ లు కూడా
తెలంగాణలోని ఏపీ కేడర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీరందరినీ వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని గురువారం ఆదేశించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణి ప్రశాంత్, ప్రశాంతి సహా 11 మంది ఐఏఎస్ అధికారులు ఎపీలో రిపోర్టు చేయనున్నారు.