బాలానగర్ పిఎస్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం. బాలానగర్ ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుంటున్న బైక్ ను లారీ (AP04 X9032) ఢీకొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.