హైదరాబాద్: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం రేవంత్

82చూసినవారు
హైదరాబాద్: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం రేవంత్
ఆనాడు రూ.2కే కిలో బియ్యంలా.. ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు మంగళవారం సూచించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. 'భూ భారతిని రైతులకు చేరవేయాలి. ఇందిరమ్మ ఇండ్లు ఆదర్శంగా నిలిచింది' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్