ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట మే 20వ తేదీన జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ సంఘం ఎల్బీనగర్ జోన్ ప్రధాన కార్యదర్శి ఎం మద్దిలేటి అన్నారు. నాడు దేశంలో ఎన్నో పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 29 చట్టాలను తీసేస్తూ 4 కోడ్ లు వేస్తూ 74 కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.