ఆర్టీఏ నిబంధనల ప్రకారం స్కూల్, కాలేజ్ బస్సుకు ఫిట్‌నెస్ టెస్టు తప్పనిసరని ఈస్ట్ జోన్ ఆర్టీవో కిష్టయ్య శనివారం తెలిపారు. జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, కార్యదర్శి సి. రమేష్ ఆదేశాల మేరకు మలక్‌పేట్ ఆర్టీవో కిష్టయ్య ఆధ్వర్యంలో ఆర్టీఏ ఈస్ట్ జోన్ నాగోల్ కార్యాలయం ప్రాంగణంలో స్కూల్, కాలేజ్ బస్సుల యాజమాన్యం, డ్రైవర్లకు బస్సు ఫిట్‌నెస్ నిబంధనలపై అవగాహన నిర్వహించారు.