రంగారెడ్డి: వైన్స్ షాప్‌లో చోరీకి వచ్చి మర్డర్ చేసిన దుండగులు (వీడియో)

74చూసినవారు
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షాబాద్ మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్స్‌లో పనిచేసే చేగూరి బిక్షపతి అనే 30 ఏళ్ల యువకుడు దొంగతనానికి వచ్చిన దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దుండగులు అతనిపై ఆయుధంతో దాడి చేసి, తలపై గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్