జల్ పల్లిలో సమస్యలను పరిశీలించిన కేఎల్ఆర్

77చూసినవారు
జల్ పల్లిలో సమస్యలను పరిశీలించిన కేఎల్ఆర్
జల్ పల్లి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ కేఎల్ఆర్ గురువారం పరిశీలించారు. గ్రామంలో నెలల తరబడిగా రోడ్లపై పారుతున్న మురుగును చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఈ ప్రాంతాన్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన మహిళలకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్