కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఖాజిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున అశోక్ లీలాండ్ టిప్పర్ అగ్నిప్రమాదానికి గురైంది. టిప్పర్‌ను అన్లోడ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.