రాచకొండ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల్లో సుమారు 1400 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో సీపీ సుధీర్ బాబు నేతృత్వంలో పోలీసులు విజయాన్ని సాధించారు. ఈ రికవరీలో మొత్తం 3 కోట్లు విలువచేసే 1016 మొబైల్ ఫోన్లు తిరిగి పొందబడ్డాయి. గురువారం సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఫోన్ యొక్క లొకేషన్‌ను ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు.