అజాంపురలో పర్యటించిన ఎమ్మెల్యే

50చూసినవారు
అజాంపురలో పర్యటించిన ఎమ్మెల్యే
అజాంపుర డివిజన్ పరిధిలో మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల గురువారం పర్యటించారు. చంచల్ గూడలో కొనసాగుతున్న సీవరేజ్ లైన్ పనులపై ఆరా తీశారు. పనులు పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ  కార్యక్రమంలో కార్పొరేటర్ షేక్ మొహురుద్దీన్ అబ్రహం, ఎంఐఎం కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్