నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రాష్ట్ర రైతు మహోత్సవం -2025 జరుగుతోంది. ఆదివారం మూడో రోజు రైతు మహోత్సవంలో వందలాది మంది రైతులు హాజరయ్యారు. సుదూర ప్రాంతాల నుండి రైతులు, నగర ప్రజలు వచ్చి సందర్శించారు. ఈ వేడుకలో వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొన్నారు. దూరప్రాంతాల నుండి వచ్చిన రైతుల వివరాలు, వారు సాగుచేసే పంటల సమాచారం, వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు అడిగి తెలుసుకున్నారు