

నటి కల్పికపై కేసు నమోదు
TG: నటి కల్పికపై కేసు నమోదైంది. గత నెల 29న ప్రిజం పబ్బులో నెలకొన్న వివాదంలో ఆమె హల్చల్ చేసిన విషయం తెలిసిందే. పబ్లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం ఆమెపై గచ్చిబౌలి పీఎస్లో ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో నటి కల్పికపై కేసు పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం.