హైదరాబాద్: కేసీఆర్‌కు బిగ్ షాక్.. లీగల్ నోటీసులు పంపిన లాయర్

52చూసినవారు
హైదరాబాద్: కేసీఆర్‌కు బిగ్ షాక్.. లీగల్ నోటీసులు పంపిన లాయర్
మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్‌ అసెంబ్లీకి గైర్హాజరు అవుతుండటంతో ఆయనకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ సోమవారం లీగల్ నోటీసులు పంపింది. అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస రెడ్డి ఈ నోటీసులు పంపారు. ప్రతిపక్ష నేతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని కేసీఆర్‌కు సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్