టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ ఫైర్ (వీడియో)
AP: కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఎందుకు పట్టించుకోలేదని స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ నెల 27న 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి పవన్ పడవలో వెళ్లి పరిశీలించారు. గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికీ కొనసాగుతోందని, జవాబుదారీతనం లేదని అసహనం వ్యక్తం చేశారు.