తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి శనివారం ఒక ఛానెల్ లో తెలిపారు. సీఎం పదవి ఎవరికో అధిష్ఠానం నిర్ణయిస్తుంది అన్నారు. మా కార్యకర్తల్లో ఎవరికి పదవి వచ్చినా నాకు సంతోషమే అన్నారు.లక్ష బుల్డోజర్లు తెచ్చినా పేదల ఇళ్లు కూల్చలేరు అని, అలా చేయాలనుకుంటే ఇప్పుడున్న జైళ్లు సరిపోవు అన్నారు. పేదల ఇళ్లను కూల్చబోమని హామీ ఇస్తే మూసీ ప్రక్షాళనకు నేను సహకరిస్తా అని కిషన్రెడ్డి అన్నారు.