మలక్ పేట్ నియోజకవర్గంలోని 80 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం స్థానిక ఎమ్మెల్యే బల్లాల చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 40,78,500 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే బల్లాల తెలిపారు. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.