అజాంపుర డివిజన్ పరిధిలో మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల శనివారం పర్యటించారు. చంచల్ గూడ కమాన్ వద్ద కొనసాగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులతో పాటు సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పనులను వేగవంతం చేయాలని, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్ షేక్ మొహియుద్దీన్ అబ్రహం, కార్యకర్తలు పాల్గొన్నారు.