బస్పాస్ ధరలు పెంచిన ప్రభుత్వం ప్రజలపై భారీగా భారం మోపిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. విద్యార్థులు, చిరుద్యోగులపై నెలకు సగటున రూ. 300 వరకు భారం పడుతోందని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా రూట్లలో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నపకపోవడంపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం మోపడం ప్రభుత్వానికి అలవాటైపోయిందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.