హైదరాబాద్ పాతబస్తీలో నిర్వహించిన మొహర్రం ఆశురా వేడుకల్లో ఆదివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, శానిటేషన్, రోడ్ క్లీనింగ్, మరియు ఇతర సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు. భక్తులతో మాట్లాడిన కమిషనర్, శాంతియుతంగా కొనసాగుతున్న వేడుకలను ప్రశంసించారు.