కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి అభివృద్ధి చేసిన కృషి సంకల్ప్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని సెంట్రల్ డ్రైలాండ్ వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 12 వరకు దేశవ్యాప్తంగా 700కి పైగా జిల్లాల్లో కొనసాగుతుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో జరిగిన సమావేశంలో ప్రకటించారని తెలిపారు.