హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. రానున్న గంట సేపట్లో నగర వ్యాప్తంగా విస్తరిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుందని వివరించింది. కాసేపట్లో ఖమ్మం, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. మీ ఏరియాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.