చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జి రోడ్డుపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడింది. బైక్ పై వెళుతున్న వాహన దారుడికి తృటిలో ప్రమాదం తప్పింది. వాహన దారుడు గమనించి రోడ్డుపై బైక్ వదిలి పారిపోయాడు. ఇది గమనించిన మిగతా వాహనాదారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపి వేశారు. దింతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమా చారం అందుకున్న పోలీసులు వాహనాలను మళ్లించారు.