తెలంగాణలో 16 లక్షల మంది విద్యార్థుల ఫీజులు తక్షణమే చెల్లించాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈసీఐఎల్లో శనివారం ర్యాలీ నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీకి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 4 నెలలుగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.