అల్వాల్ డివిజన్ పరిధి వెంకటరమణ కాలనీలో ప్రమాదవశాత్తు రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లకొమ్మలను క్లియర్ చేస్తున్న సమయంలో శనివారం ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు. ఘటనా స్థలాన్ని డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. త్వరగా విద్యుత్ ను పునరుద్ధరించాలని సూచించారు.