వెంకటాపురం డివిజన్ సుభాష్ నగర్ లోని ప్రైమరీ స్కూల్లో తెలంగాణ స్టేట్ లీగల్ అథారిటీ సర్వీసెస్ అధ్వర్యంలో గురువారం విద్యార్థులకు లీగల్ అథారిటీ సర్వీసెస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లా జడ్జి జస్టిస్ టీ. కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా లీగల్ అథారిటీ సర్వీస్ పై పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.