భగత్ సింగ్ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి భగత్ నగర్ కాలనీ వాసులు ఆ దేశభక్తుని స్ఫూర్తికి శనివారం ఘన నివాళులు అర్పించారు. భగత్ సింగ్ ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా విప్లవ జ్వాలలను రగిలించిన సూర్యుడు 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడు, భారతమాతకు చేసిన సేవను త్యాగాన్ని స్మరిస్తూ, ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం, పోరాట, పట్టుదల, దేశభక్తి యువతకు స్ఫూర్తిదాయకమని కాలనీ వాసులు పేర్కొన్నారు.