షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ ఇంట్లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సాయినాథపురంలోని ఒక ఇంట్లోని రెండవ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అందులో చిక్కుకున్న ఒక వ్యక్తిని రక్షించారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.