మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ జిహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలో కమీషనర్ కర్ణన్ ని కలిసి సఫిలగూడ చెరువుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని శనివారం కోరడం జరిగింది. హెచ్ ఎం డి ఏ సహకారం తీసుకొని మురుగు నీటి మర్లింపు, చుట్టూ బండ్, గుర్రపు డెక్క, బోటింగ్, తదితర అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించాలని కోరడం జరిగింది. స్పందించిన కమీషనర్ కర్ణన్ హెచ్ ఎం డి ఏ కమీషనర్ తో సైతం చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని కార్పొరేటర్ శ్రవణ్ తెలిపారు.