హబ్సిగూడ: చిన్నారికి మత్తు ఇంజక్షన్.. కొద్దిసేపటికే మృతి (వీడియో)

55చూసినవారు
హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కంట్లో నలక పడిందని చిన్నారి అన్విక(5)ను స్థానిక ఆనంద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నలక తీసేయాలంటే సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. శుక్రవారం ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్