విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రొపెసర్ సాయిబాబా పార్థివ దేహానికి మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం నివాళులు అర్పించారు. హైదరాబాద్ మౌలాలి లోని అయన నివాసం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సామాజిక విలువలు కలిగిన సాయిబాబా మృతి చెందడం బాధాకరమన్నారు. హరీష్ రావు వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.