
2040 కల్లా ముంబయి 10% శాతం మునిగిపోతుందట: అధ్యయనం
వాతావరణ మార్పుల వల్ల తీరప్రాంత నగరాలకు ముప్పు పెరిగుతోంది. బెంగళూరుకు చెందిన CSTEP(సెంటర్ ఫర్ స్టడీ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ) అధ్యయనం ప్రకారం, 2040 నాటికి ముంబయి 10% మునిగే అవకాశం ఉంది. పనాజీ కూడా 10% భూభాగాన్ని కోల్పోవచ్చని.. విశాఖపట్నం, మంగళూరు, కొచ్చిన్, ఉడుపి, పూరీ నగరాల్లో 5% వరకు ముంపు ముప్పు ఉందని హెచ్చరించింది. సముద్ర మట్టాల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణం అని పేర్కొంది. 1987 నుంచి 2021 వరకు సముద్ర స్థాయిలను పరిశీలించి ఈ అంచనా వేసింది.