మల్కాజిగిరి డివిజన్ పరిధికి చెందిన పలువురు లబ్ధిదారులు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్డీసీ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం సహాయనిధితో పేదలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సదుపాయం అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు.