
రాజకీయ వ్యూహకర్తతో మంత్రి లోకేశ్ భేటీ!
AP: మంత్రి నారా లోకేశ్ నిన్న ఢిల్లీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయ్యారు. సీఎం నివాసం 1-జన్‌పథ్‌లో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో దేశ రాజకీయ పరిస్థితులపై, తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చర్చించినట్లు సమాచారం. కాగా, ఐప్యాక్ నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ బిహార్‌లో ‘జన్ సురాజ్’ అనే పార్టీని ఏర్పాటు చేశారు.