మల్కాజ్ గిరి డివిజన్ పరిధిలో సర్ధార్ పటేల్ నగర్ లో రూ. 60 లక్షలతో చేపట్టిన నాలా కల్వర్టు పనులను డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ శుక్రవారం పరిశీలించారు. పనులు చేసేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కంట్రాకర్ కు సూచించారు. నాలా పనుల వల్ల వర్షాకాలంలో ముంపు ప్రాంతాల ప్రజల బాధలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్, శ్రీకాంత్, సుబ్బారావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.