దైవ చింతనతో మానసిక ప్రశాంతత: ఎమ్మెల్యే

85చూసినవారు
దైవ చింతనతో మానసిక ప్రశాంతత: ఎమ్మెల్యే
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం గౌతమ్ నగర్ డివిజన్ లోని యాదవ్ నగర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మీ దేవాలయ 5వ వార్షికోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునిత రామ్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్