తిరుమలగిరిలోని టీచర్స్ కాలనీలో టీచర్స్ కోఆపరేషన్ హౌసింగ్ సొసైటీ వారి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు శాలువాతో ఈటలను ఘనంగా సన్మానించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ. కంటోన్మెంట్ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.