![BREAKING: ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు! BREAKING: ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు!](https://media.getlokalapp.com/cache/18/84/1884ddf7c0b3ef8c8cafad512d0f3251.webp)
BREAKING: ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు!
తెలంగాణలో ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదివరకే పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయగా.. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతోంది.