78వ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా 21వ డివిజన్ పరిధిలోని సాయిభవానినగర్ సబ్స్టేషన్ వద్ద స్థానిక కార్పొరేటర్ భూక్య సుమన్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. తదనంతరం 21వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు రాజశేఖర్ కాలనీ, నార్త్ బాలాజీహిల్స్ కాలనీ, నార్త్ బాలాజీహిల్స్ ఫేస్-1 కాలనీ, బాలాజీహిల్స్ ఫేస్-3 కాలనీ, ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీల్లో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు.