రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

62చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కొంపల్లి నుండి మేడ్చల్ వైపు ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా జాతీయ రహదారి 44పై పక్కనే ఆగి ఉన్న కారు డోరు తీయడంతో ద్విచక్ర వాహనానికి తగిలి వెనకాల కూర్చున్న వెంకటరెడ్డి రోడ్డుపై పడిపోయాడు. దీంతో వెనకాల నుండి వస్తున్న లారీ అతనిపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే వెంకట్ రెడ్డి మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్