మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లే దారి లోతుర్కపల్లి గ్రామం వద్ద అభిమానులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభివడం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.