ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భోరెడ్డి అయోధ్య రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్టీఐ కమిషనర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్, పలువురు అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.