ఫిబ్రవరి రెండో తారీఖున ఓయూలో జరిగే మాదిగ విద్యార్థి యువజన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిడమర్తి రవి అన్నారు. ఆదివారం ఘట్కేసర్ మున్సిపల్ కేంద్రం వాసవి అపార్ట్మెంట్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ మా గర్జన ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగకు పూర్తిగా వ్యతిరేకం అని అన్నారు. ఆయన ఏడు శాతం అని చెప్తున్నాడు మేము 12 శాతం కొరకు పోరాడుతున్నామని తెలిపారు. ఆయన మాదిగ ఓట్లను బిజెపి వైపు తీసుకెళ్లాలని చూస్తున్నారని అన్నారు.