ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని డబిల్ పూర్ కామన్ వద్ద రోడ్డులో భారీగా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే గుంతలు చెరువులను తలపిస్తున్నాయని ద్విచక్ర వాహనదారులు ఆ గుంతలో పడి చాలా గాయాలు సైతం అయినా పట్టించుకునే నాధుడే లేడని వాహనదారులు వాపోతున్నారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తూతూ మంత్రంగా మట్టి నింపి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారన్నారు.