హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ నారపల్లిలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. చెరువులోకి దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి, ఒక కూతురు మృతి చెందగా.. మరో ఇద్దరు కూతుళ్లను స్థానికులు కాపాడారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.